logo

Get Latest Updates

Stay updated with our instant notification.

logo
logo
account_circle Login
Avirbhava Paksha Patrika 16th Edition 1st June 2020
Avirbhava Paksha Patrika 16th Edition 1st June 2020

Avirbhava Paksha Patrika 16th Edition 1st June 2020

By: Avirbahva Publishers
  • Avirbhava16th edition 1 June 2020
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published bimonthly

About this issue

లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 4 ఫ్యాబ్ లివింగ్ 7 ఆరోగ్య వాణి 10 మహిళ శక్తి 12 నేటి సౌదామిని 15 మేలుకొలుపు 18 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 21 కథా సమయం 25 నేటి కవిత్వం 31 పుస్తక దర్పణం 33 కవితామృతం 38 నవలాముత్యం 39 సంస్కృతి 45 యువత స్నేహస్వరం 50 కార్యభారతం 53 కళా వైభవం 55 జిజ్ఞాస 59 రాజ్యం సందర్భం 61 జీవన చిత్రాలు 66 తెలంగాణం 71 ఆంధ్రా దర్పణం 72 సినిమా సినీ హోరు 73 సీరియల్ 77 మా తత్వం

About Avirbhava Paksha Patrika 16th Edition 1st June 2020

సమాలోచన ఇంకా స్వరాజ్యం మిగిలిందా?         డెబ్బై మూడు సంవత్సరాల స్వతంత్ర చరిత్ర ఇంకా ఓ కలగానే మిగిలింది , అదే ముసుగులో మన బ్రతుకుల్ని పెత్తందార్ల చేతిలో పెట్టి స్వతంత్రంగానే ఉన్నాం , జీవిస్తున్నాము అనే ఈ జన సంద్రాన్ని ఓ గొర్రెల మందతోనే పోల్చుకుని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది . రాజ్య శాస్త్రాన్ని  ఈ నాడు ఓ అర్థశాస్త్రం గా మార్చిన మన నాయకులని తప్పు పడదామా లేక తమ ఓటుని నమ్మక అమ్మిన జనాన్ని తప్పు పట్టాలా ? ఏది ఏమైనా తెల్ల తోల్ల సారుల దగరనుంచి రక్తం చిందించి సంపాదించిన స్వతంత్రాన్ని మన నల్ల దొరలకి తాకట్టు పెట్టవలసిన పరిస్థితులు  ఎవరు తెచ్చారు ?.         కథ చరిత్రకి సోపానాలు మన కళాకారులు. వారు లేనిదే ఏ సినిమా పండదు, ఏ హీరోకి ఘనత దక్కదూ ,సినిమా తెర మీద ఓ సారైనా కనిపించాలి అన్న కాంక్షతో జీవిత కాలం అవమానాలు భరిస్తూ బ్రతికే వీరిని కూడా మన బడా బాబులు వదలలేదు . వారి యూనియన్ని అడ్డం పెట్టుకొని చిత్రపురిలోకి చొరపడిన పందికొక్కులు ఎవరన్నది మనం ఆలోచించాలి. యూనియన్ ముసుగులో ఎన్నో అక్రమాలు బయట పడుతున్న పైన సింహాసనాలు అధిష్టించిన  దొరలు మాత్రం అక్రమార్కులకు  కాపు కాస్తున్నారు. పేదలైన జూనియర్ల కడుపులు కొడుతున్నారు .         కరోనాలోనే వీరికి బరోనా కష్టాలు మొదలైనవి అనుకుంటే అది దొరల ఇంద్రజాల అద్భుత నాటకమే , తెలుగు సినిమాలో ముప్ఫై సంవత్సరాలుగా  జూనియర్ల  మీద జరిగిన దోపిడి కధనాలే ఎక్కువే .వారికి రావాల్సిన లేబర్ బెనిఫిట్స్ దగ్గర్నుంచి చిత్రపురి కాలనీలో వీరికి కేటాయించిన ఇల్లు అమ్ముకోవటం వరకు జరిగినవి చూస్తే ఇదో ఇందిరా నగర్ రహస్య కుట్ర అనే అనవచ్చు .         జనానికి మేము దేవుళ్ళ౦ అన్న ముసుగులతో వారి బ్రతుకులని రక్త పిశాచులలా పీలుస్తూ బ్రతుకుతున్న ఈ దెయ్యాల చరిత్ర మీ ముందు ఈ నాడు పెడుతున్నాము . తెలుగు సినిమా అనే తులసి వనంలో వీరు వేసిన గంజాయి పంట గురించి ఆవిర్భవ కనిపెట్టిన నిజాలు మీ ముందుకు ఈ నాడు తెస్తున్నాము .         ఈ నాటి కాలంలో ఓ పత్రిక అంటే సామాజిక దర్పణంగా ఉండటం కంటే ఓ నోటు ప్రింట్ చేసే వ్యాపారాలగానో లేక ఓటు కొనుక్కునే సంస్థలగా మారినవి కానీ జన గళంగా నిలవ లేక పోవటానికి కారణాలు రాజకీయవేత్తలకు  నాలుకలుగా మారడం అన్నది సత్యం . అలా కాక జనం మధ్యనే ఉంటూ సిరానే విప్లవ వాయిధ్యంగా  మలచి నిల్చోవాలి అన్న ఆలోచనతోనే ఆవిర్భవ ఉంది .మీరు కూడా మీ హక్కుల్ని కాపాడుకోవటానికి ముందడుగు వేయండి.  శ్రీ దత్త Sri Dutta