Pranathi Maasa Patrika 8th Edition April 3rd 2021
Pranathi Maasa Patrika 8th Edition April 3rd 2021

Pranathi Maasa Patrika 8th Edition April 3rd 2021

  • Pranathi Maasa Patrika 8th Edition April 3rd 2021
  • Price : Free
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published monthly
This is an e-magazine. Download App & Read offline on any device.

విషయ సూచిక 

వేదం

ఆచార సంప్రదాయాలు                     4

సాధనతోనే సాధ్యం      7

అమృత మథనం               10

తాపత్రయములు                                   16

జీవం

దిక్సూచి   19

నిజమైన ఆప్తుడు ఎవరు ?              21

ఆధ్యాత్మిక గురువు 

రామకృష్ణ పరమహంస                         23

వివేచన 

కోడలు-వంశ గౌరవం              25

సుందరకాండ వైభవం              27

జీవితం ఓ 

యుధ్ధ రంగ౦       31

ఉగాది క్రాంతి 33                  

 తత్వం

సాలీడు కథలు   34 

 

దృక్పథం               

 అతి వ్యామోహం అనర్థం                       

 ఇంటియాలి విడిచి యిలజారకాంతల.                 

 వెంట తిరుగువాడు వెర్రివాడు.                            

పంటచేను విడిచి పరిగ ఏరినట్లు.                  

 విశ్వదాభిరామ వినరవేమ.                                            

సలక్షణమైన భార్యను విడిచి పరకాంతల పొందుగోరే వాడిని వ్యభిచారి అంటారు. ఇటువంటి వ్యక్తులు పెక్కు అనర్థాలు ఎదుర్కొంటారు. సమాజంలో అపకీర్తి పొందుతారు. విషయలంపటులు బాగుపడిన దాఖలాలు ఎక్కడా లేవు. కలిమి అయినా, లేమి అయినా సంప్రదాయ బద్దంగా, అగ్నిసాక్షిగా చేపట్టిన ధర్మపత్ని నే సర్వస్వంగా భావించాలి. ఆమె మనకు సంఘంలో గౌరవాన్ని పెంపొందింప చేస్తుంది. మన పరువు ప్రతిష్టలు కాపాడుతుంది. పైగా,  మనకు వంశాన్ని ఇస్తుంది. అటువంటి త్యాగశీలిని విస్మరించి పరకాంతల పట్ల వ్యామోహం చెందేవాడు బ్రస్తుడు  అవుతాడు.            

     వెలయాలు జలచరం లాంటిది. నీల్లుంటేనే వాటిని పట్టుకుని వ్రెళ్ళాడుతుంది. అవి ఎండిపోతే...అలాగే, మన సర్వస్వాన్ని, మన సంపదలను పీల్చి పిండిచేసే అక్రమ సంబంధం కలిగి ఉండటం..మన శాశ్వత ఆనందాలను తాకట్టు పెట్టడమే...వారకాంతల వలన లభించే ఆనందం మేడిపండు వంటిది..తెచ్చి పెట్టుకున్న ఆ కులుకులకు, నయగారాలకు బానిసలు కావడం అతి పెద్ద బలహీనత..పాపభీతి లేకుండటం.                 

      ఇటువంటి అపసవ్య సంబంధాల వలన సంఘంలో చీడపురుగు గతే పడుతుంది. కడవరకు కలిగివుండే సంబంధాన్ని చేజార్చుకు ని, ఇటువంటి తాత్కాలిక సుఖాలకు వెంపర్లాడటం మూర్ఖత్వం కాక మరేమిటి...పంట చేనుకు, పరిగకు తేడా తెలియని ఆధములు తమ సంసారాలు ను నరకప్రాయం చేసుకుంటారు. పుట్టెడు రోగాల పాలవుతారు.                                     

                             తనను వంచించిన వెలయాలూ..మరొకరితో కూడా కులకదని అతని అంతరాత్మ కు తెలియదా..  ఆలినీ ఎడబాసి, వెలయాలి వెంట పరుగులు పెట్టడం బుద్ధిహీనత కాక మరేమిటి ? ఇల్లాలికి తెలియనిది నయవంచన. వెలయాలికి అబ్బిన విద్య అవసరం తీరాక వెలివేయడం.. మరి ఎండమావుల వెంట పరుగులు తీస్తే ఏదయినా లాభం ఉంటుందా..చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటి ? కంటిముందున్న స్వర్గాన్ని కాలదన్నుకోడం విచక్షన, వివక్ష, వివేకము మరచిన మూర్కులు చేసే పని.           

- పంతంగి శ్రీనివాస రావు

ఎడిటర్ - ఇన్ - చీఫ్.