ఆవిర్భవ పక్ష పత్రిక  ఏడవ  సంచిక  5 డిసెంబర్ 2019
ఆవిర్భవ పక్ష పత్రిక  ఏడవ  సంచిక  5 డిసెంబర్ 2019

ఆవిర్భవ పక్ష పత్రిక ఏడవ సంచిక 5 డిసెంబర్ 2019

  • Avirbhava seventh edition 5th December 2019
  • Price : Free
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published fortnightly
This is an e-magazine. Download App & Read offline on any device.

విషయ సూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒక్కరు 3 ఫ్యాబ్ లివింగ్ 7 మహిళా శక్తి 9 నేటి సౌదామిని 12 మేలుకొలుపు 16 రాంపా కార్టూన్ కెచెప్ 19 సాహిత్యం సాహితి మార్గదర్శకులు 20 కథ సమయం 23 నేటి కవిత్వం 33 పుస్తక దర్పణం 34 సంస్కృతి 35 యువత స్నేహ స్వరం 40 కార్య భారతం 43 జిజ్ఞాస 48 రాజకీయం సందర్భం 50 జాతీయం 54 తెలంగాణం 58 ఆంధ్ర దర్పణం 59 సినీ దర్పణం సినీ హోరు 61 గత సినీ వైభవాలు 63 సీరియల్ 65 మా తత్వం 67

సంపాదకీయం

మణి గోవిందరాజుల  

 

మనిషి  స్వేచ్ఛా జీవి. ఆ  స్వేచ్ఛతో  పాటు సంఘ జీవి  కూడా  కనుక  హక్కులు, బాధ్యతలు  కూడా  అంతర్లీనంగా  జీవితయానంలో   పెనవేసుకుని  ఉంటాయి. డిసెంబర్ 10 న  అంతర్జాతీయ  మానవ  హక్కుల  దినోత్సవం  పురస్కరించుకుని  మన  హక్కులే  కాకుండా  నైతికత  గురించి  కూడా  బాధ్యత  వహించాల్సిన  తరుణం  ఇది.

 హక్కులు  ఎలా  అయితే  వ్యక్తిగతమైనవో  అలానే  నైతిక విలువలు  కూడా  వ్యక్తుల  మనస్తత్వాల  బట్టి  మారుతూ  ఉంటాయి.  ప్రతి  పరిస్థితికి  ఎన్నో  దృక్కోణాలు  ఉంటాయి. దానిని  అనుభవించేవారికి  మాత్రమే  దాని  నైతిక  నియమాల  ప్రభావం  గురించి  స్పష్టత  ఉంటుంది. నేటి  సంస్కృతిలో  ఎదుటి  వ్యక్తుల్ని  వ్యక్తిగతంగా  నచ్చనంత  మాత్రాన  వారి  నైతికత  గురించి  దుష్ప్రచారం  చేసే  ధోరణి  పెరుగుతుంది. 

       మానవ  హక్కుల్లో  ప్రతి  మనిషికి  జీవించే  హక్కు  ఉంది. ప్రతి హక్కు  వెనుక  ఓ  బాధ్యత  కూడా  ఉంది. జీవించడం  వ్యక్తిగత  హక్కు  అయితే  ఇతరుల  జీవించే  హక్కును  మన  అభిప్రాయాల  ఆధారంగా  భంగం  కలగకుండా  చూసుకోవడం  దానికి  ముడి పడి  ఉన్న  బాధ్యత. 

 

      కోట్ల  మంది  జనుల  సమూహమే  కాదు  దేశమంటే , ఆ  కోట్ల  మంది  మధ్య  ఉండే  సమన్వయ  సమైక్యత  కూడా. 2019  దాదాపు  పూర్తవుతున్న  తరుణంలో  భారత్  ఎన్నో   సాహసోపేత  నిర్ణయాలతో  ఇన్నేళ్ళు  ఓ   రకమైన ఊగిసలాటలో   ఉన్న  పరిస్థితి  నుండి బయట పడి  జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో  నూతన  శక   ఆవిర్భావానికి  తెర  తీసింది. 

       బయట  దేశం  చేసే  యుద్ధాలు  ఎన్నో   ఉండవచ్చు . కానీ  దేశ  పౌరుల  మధ్య  ఉండే   పరస్పర  గౌరవ  ధోరణి  మాత్రమే  దేశాన్ని  అంతర్గత  వైరాల  నుండి   కాపాడగలదు.  మనతో  ఉండే  పొరుగు  వారి  వైవిధ్యాన్ని   అన్ని  విషయాల్లో  మన  ఇష్టాయిష్టాల   ప్రమేయంతో  ప్రసక్తి  లేకుండా   గౌరవిద్దాం. అదే  మానవ  హక్కుల  ఆచరణకు  మూలం.