Avirbhava Paksha Patrika 21st Edition SEPTEMBER 24TH 2020
Avirbhava Paksha Patrika 21st Edition SEPTEMBER 24TH 2020

Avirbhava Paksha Patrika 21st Edition SEPTEMBER 24TH 2020

  • Avirbhava Paksha Patrika 21st Edition SEPTEMBER 24TH 2020
  • Price : Free
  • Avirbahva Publishers
  • Language - Telugu
  • Published bimonthly
This is an e-magazine. Download App & Read offline on any device.

విషయసూచిక లైఫ్ స్టైల్స్ మనలో ఒకరు 4 ఫ్యాబ్ లివింగ్ 7 ఆరోగ్య వాణి 9 మహిళ శక్తి 12 నేటి సౌదామిని 15 మేలుకొలుపు 19 సాహిత్యం సాహితీ మార్గదర్శకులు 23 కథా సమయం 26 నేటి కవిత్వం 33 పుస్తక దర్పణం 35 కవితామృతం 39 నవలాముత్యం 41 సంస్కృతి 47 యువత స్నేహస్వరం 53 కార్యభారతం 55 కళా వైభవం 57 జిజ్ఞాస 62 రాజ్యం సందర్భం 64 జీవన చిత్రాలు 68 ప్రాంతీయం 72 సినిమా గత సినీ వైభవాలు 75 సీరియల్ 77 మా తత్వం

సమాలోచన

వైఫల్యాల నుండి నేర్చుకుని  జీవితంలో ఎదగాలి అనే నానుడి ఎప్పుడూ మనమందరం వింటూనే ఉంటాం. ఆవిర్భవ పక్ష పత్రిక మొదలై సంవత్సరం నిండింది. ఈ పయనంలో ఎన్నో ఒడిదుడుకులు,అడ్డంకులు.

డిజైన్ ,కంటెంట్ లో కూడా విభిన్నత కోసం ప్రతి పక్షం పడుతున్న శ్రమ పాఠకవిదితమే. ఈ మధ్య ఆవిర్భవ పక్ష పత్రిక తేదీ దాటి వస్తున్న విషయాన్ని ఎందరో ఆవిర్భవ పాఠక అభిమానులు దృష్టికి తెచ్చారు. ఆవిర్భవ ప్రస్తుతం 'భవతీ భిక్షాందేహీ', 'చిత్రపురి' సమస్యలకై పోరాడుతూ ఉండడం మీ అందరికీ తెలిసిందే. 

కార్యాచరణ లేకుండా కేవలం రాతలకే పరిమితమయ్యే పత్రిక ఆవిర్భవ కాదు. పత్రిక సమస్యకు పరిష్కారానికి మధ్య వారథి లేక చిన్న ప్రయత్నమవ్వాలన్నదే మా నియమం. కనుక ఈ మధ్య ఈ కారణాల వల్ల ఆవిర్భవ పక్ష పత్రిక విడుదల ఆలస్యమవుతున్నందుకు పాఠకులను సహృదయంతో అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాము. 

ఆశయం-సంకల్ప శుద్ధి- ఆచరణ ఈ మూడు మౌలిక సిద్దాంతాల మూలంతో నడుస్తున్న ఆవిర్భవ ఇప్పుడే పాకడం నుండి నడిచే స్థాయికి చేరుకుంది. ప్రతి విషయానికి బాలారిష్టాలు ఉన్నట్టే ఆవిర్భవ కూడా పడుతూ లేస్తూ నిలబడుతూ వచ్చింది.

ఆవిర్బవ పాఠకులకు,ఆవిర్భవకు తమ రచనల ద్వారా ఆశీర్వదిస్తున్న సరస్వతీ పుత్రులందరికీ టీం ఆవిర్భవ తరపున కృతజ్ఞతాభివందనాలు.

సమాజంలో ఏ అంశానికి నిర్దిష్టమైన సూత్రం ఉండదు. సందర్భాల,పరిస్థితుల మార్పుతో ప్రతి ఒక్కటి మారుతూనే ఉంటుంది. అలాంటి మార్పుతో సహజీవనం చేస్తున్న ఆవిర్భవ ఎప్పటికీ మార్పులతో తనను తాను మార్చుకుంటూ అటు నాణ్యతా, ఇటు పాఠకప్రియత్వం నిలుపుకునే పత్రిక.

దీనికి సహకారం అందిస్తున్న సరస్వతీ పుత్రులందరికీ టీం ఆవిర్భవ తరపున నమస్సుమాంజలి.