NAVADISHA
NAVADISHA

NAVADISHA

  • 31st july 2026
  • Price : Free
  • Navadisha Media
  • Language - Telugu
  • Published daily
This is an e-magazine. Download App & Read offline on any device.


*ఇంజినీరింగ్ స్టూడెంట్స్ 'క్రిమినల్ వేస్ట్'*

*మోడీ.. కాపాడండి..! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో*

*టెలికాం’ నేరాలపై ఫోకస్*

*రూ.17 వేల కోట్లు ఇవ్వండి*

మీ ముందుకు "నవదిశ" అనే కొత్త వార్తా పత్రికను తీసుకురావడం మాకు ఆనందంగా ఉంది. సమాజానికి ఉపయోగపడే, ప్రజలకు అండగా నిలిచే జర్నలిజాన్ని అందించాలనే లక్ష్యంతో నవదిశ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. మేము ఏ పత్రికకూ పోటీగా రాలేదు. ఎవరినీ అధిగమించాలని, ఎవరినీ దాటేయాలని మా ఉద్దేశం కాదు. అలాగే ఏ వ్యక్తి, సంస్థ లేదా రాజకీయ నాయకుడు మా లక్ష్యం కాదు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ప్రజల గొంతుకగా ఉండటమేనని మేము విశ్వసిస్తున్నాం. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, బాధితుల పక్షాన నిలవడం, సమాజంలో అవగాహన కల్పించడం, ప్రజలను మేల్కొల్పడం మా ప్రధాన సంకల్పం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా ప్రయోజనాలే మా ప్రమాణం. నవదిశలో ప్రచురితమయ్యే ప్రతి వార్తలో నిజం, నిజాయితీ, నిష్పాక్షికతకు అత్యంత ప్రాధాన్యంగా ఉంటుంది. వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడమే మా ధ్యేయం. పత్రిక రంగంలోనున్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తాము. అదేవిధంగా మా పత్రికపై పెద్దల, చిన్నల సలహాలు, సూచనలు మాకు అవసరమని భావిస్తున్నాము.  జన్​ జీకి తగ్గట్టుగానే మా వార్తల పయాణం ఉంటుందని తెలియజేస్తున్నాము. ప్రజల నమ్మకాన్ని సంపాదించుకోవడమే మా అతిపెద్ద విజయంగా భావిస్తాం. మీ ఆదరణ, సూచనలు, సహకారంతో నవదిశ ప్రజల పత్రికగా ఎదుగుతుందని విశ్వసిస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలు అందించేందుకు నవదిశడైలీ.కం వెబ్​సైట్​ తోపాటు వివిధ సోషల్​ మీడియా ప్లాట్​ఫాంలు అందుబాటులో ఉన్నాయి.